Monday, January 16, 2012

Businessman collections down chesina bodyguard

వెంకటేష్ 'బాడీగార్డ్' మహేష్ బాబు'బిజినెస్మేన్'కు సంక్రాంతి పండుగకు గట్టి షాకే ఇచ్చాడు. సంక్రాంతి యువరాజుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బిజినెస్మేన్ మొదటిరోజు కలెక్షన్లు చూస్తే, సూపర్‌స్టార్ కృష్ణ చెప్పినట్లే 'దూకుడు'ను దాటేస్తాడని అనుకున్నారు.

అయితే ఆ తర్వాతే రోజే విడుదలైన వెంకటేష్ బాడీగార్డ్ మహేష్ 'బిజినెస్'ను బాగా దెబ్బతీసింది. మొదటి రోజు రూ. 18.5 కోట్లు బిజినెస్మేన్ రాబడితే, రెండో రోజుకు ఆ కలెక్షన్లు 60 శాతం మేర పడిపోయాయి. కేవలం రూ. 5 నుంచి రూ. 6 కోట్ల మధ్య మాత్రమే బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బాడీగార్డ్‌లో సెంటిమెంట్ కమ్ ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉండటంతో సకుటుంబ సపరివారమంతా అటువైపు ఆకర్షితులైనట్లు టాలీవుడ్ న్యూస్. మరి సంక్రాంతి హీరోగా బాడీగార్డ్ నిలుస్తాడో లేదంటే బిజినెస్మేన్ తన మార్కు బిజినెస్ చేసి రికార్డు సృష్టిస్తాడో చూడాల్సిందే.

No comments:

Post a Comment